హైదరాబాద్ 24°C
అమరావతి 29°C
IST 11:42 AM
సోమవారం ఆగస్టు 24 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
తెలంగాణ

గ్యాస్, కూరగాయల ధరలు పెరిగి హైదరాబాద్ వీధి వ్యాపారులకు కష్టాలు

రచన: ఉషా కిరణం డెస్క్ ·
గ్యాస్, కూరగాయల ధరలు పెరిగి హైదరాబాద్ వీధి వ్యాపారులకు కష్టాలు
📷 Hrishav Jha / Pexels
షేర్ కాపీ అయింది ✓

హైదరాబాద్‌లో వీధి ఆహార వ్యాపారులు పెరుగుతున్న ధరలతో నష్టాల్లో ఉన్నారు. గ్యాస్, వంట నూనె, కూరగాయలు, మసాలాలు ధరలు పెరగడంతో రోజువారీ పెట్టుబడి భారం పెరిగిందని వ్యాపారులు తెలిపారు.

వ్యాపారుల ప్రకారం ఇంతకుముందు ₹100తో వచ్చే సరుకు ఇప్పుడు సగం కూడా రావడం లేదు. అమ్మకాలు జరుగుతున్నా లాభాలు రావడం లేదని వారు చెప్పారు.

వర్షాలు సరిగా లేకపోవడంతో ఉల్లి దిగుబడి తగ్గింది. గతంలో ₹100కు 5 కిలోలు లభించిన ఉల్లిపాయలు ఇప్పుడు కిలో ₹40 నుంచి ₹50 వరకు అమ్ముతున్నామని వ్యాపారులు పేర్కొన్నారు. కూరగాయల ధరలు కూడా కిలో కనీసం ₹80 వరకు పెరిగాయని వారు చెప్పారు.

టిఫిన్లు, మీల్స్ ధరలు ₹5 నుంచి ₹10 పెంచితే అమ్మకాలు తగ్గుతున్నాయని వ్యాపారులు తెలిపారు. గ్యాస్ ధరలు, బియ్యం, నూనె ధరలు కూడా ఎక్కువగా ఉన్నాయని వారు చెప్పారు.

పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం ప్రజలపై, వ్యాపారులపై పడిందన్నారు. పెరుగుతున్న నిత్యవసర ధరలు తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వీధి వ్యాపారులు కోరారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com