హైదరాబాద్ 27°C
అమరావతి 32°C
IST 3:31 PM
సోమవారం జూలై 27 · 2026
తిథి వివరాలు త్వరలో
రాహుకాలం · యమగండం వివరాలు త్వరలో
జాతీయం

26 రోజుల దీక్ష అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్; రాజ్‌ఘాట్‌లో నివాళి

రచన: ఉషా కిరణం డెస్క్ ·
26 రోజుల దీక్ష అనంతరం సోనమ్ వాంగ్‌చుక్ డిశ్చార్జ్; రాజ్‌ఘాట్‌లో నివాళి
📷 CP Khanal / Pexels
షేర్ కాపీ అయింది ✓

26 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన లడఖ్ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్యం మెరుగుపడిన తర్వాత ఆయన శుక్రవారం ఉదయం డిశ్చార్జ్ కాగా, లడఖ్ వెళ్లే ముందు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులు అర్పించనున్నారు.

వాంగ్‌చుక్ గత 26 రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరాహార దీక్ష చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కొద్ది రోజుల క్రితం సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో చేర్చారు. గురువారం సాయంత్రం కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా, మరికొందరు మంత్రులు ఆయనను కలిసి చర్చించారు. మంత్రుల భరోసాతో ఆయన ఉపవాసం విరమించారు.

డిశ్చార్జ్ అనంతరం వాంగ్‌చుక్ మాట్లాడుతూ, 'చాలా రోజుల తర్వాత ఇవాళ ఆసుపత్రి నుండి బయటికి వస్తున్నాను. ఇప్పుడు నెమ్మదిగా తింటున్నాను, శరీరంలో శక్తి వస్తోంది. లడఖ్ వెళ్లే ముందు రాజ్ఘాట్ వెళ్లి మహాత్మా గాంధీకి నివాళి అర్పిస్తాను' అని తెలిపారు.

దేశవ్యాప్తంగా తనకు మద్దతు తెలిపిన వారికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. 'దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు చిన్నా, పెద్దా అంతా కలిసి ఒక ఉద్యమం చేపట్టారు, విజయం సాధించారు. భవిష్యత్తులో కూడా మీతో అనుసంధానమై ఉంటాను' అని అన్నారు.

ఆయన చేపట్టిన ఈ నిరాహార దీక్షపై దేశవ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వచ్చాయి. కొంతమంది ఆయనకు మద్దతుగా నిలిచారు. అయితే కొన్ని వర్గాలు ఆయనపై విమర్శలు చేశాయి.

తాజాగా డిశ్చార్జ్ అయిన వాంగ్‌చుక్ రాజ్ఘాట్లో నివాళులు చెల్లించిన తర్వాత లడఖ్లోని తన స్వగ్రామానికి బయలుదేరనున్నారు.

వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.

సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com