తిరుమలలో భక్తులు మర్చిపోయిన బంగారు నగలు టీటీడీ సిబ్బంది అప్పగించారు
తిరుమలలో మూడు రోజుల క్రితం ఓ హైదరాబాద్ కు చెందిన భక్తులు అన్నమయ్య భవనంలోని 3వ నెంబర్ గదిలో బస చేసి, శ్రీవారి దర్శనం తర్వాత తొందరపాటుతో వారి బంగారు ఆభరణాలను మర్చిపోయారు. ఆ గదిని శుభ్రం చేసేందుకు వెళ్ళిన FMS సిబ్బంది ఆ నగలను గమనించి, పద్మావతి విచారణ కార్యాలయంలో అప్పగించారు.
అనంతరం విచారణ చేసిన అధికారులు సదరు వ్యక్తులకు ఆ నగలు తిరిగి ఇచ్చారు. ఈ నగల విలువ సుమారు నాలుగు లక్షల రూపాయలు ఉంటుందని అంచనా.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com