జూలై 15న నరసరావుపేట క్రెడిట్ అవుట్రీచ్‌కు నిర్మల, చంద్రబాబు రాక
ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ప్రకటన ప్రకారం, జూలై 15న నరసరావుపేటలో జరిగే క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరు కానున్నారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు నియోజకవర్గానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సుమారు రూ.1,500 కోట్ల నుంచి రూ.2,000 కోట్ల వరకు రుణాలు మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పీఎం విశ్వకర్మ, పీఎం స్వనిధి, పీఎం ఈజీపీ, పీఎం ఎఫ్ఎంఈ వంటి పథకాల ద్వారా ఈ రుణాలు అందజేస్తారు.
గత వారం రోజుల్లోనే భారీగా దరఖాస్తులు వచ్చాయని, అర్హులైన వారందరినీ దరఖాస్తు చేయించేలా బ్యాంకర్లకు లక్ష్యాలు నిర్దేశించామని ఎంపీ వివరించారు. గడిచిన రెండేళ్లుగా ఈ ప్రక్రియ కొనసాగుతోందని, ఇటీవల ఎనిమిది నెలల నుంచి మరింత ఉదృతంగా సాగుతోందని పేర్కొన్నారు.
వార్త ఆధారాలు: పబ్లిక్ న్యూస్ బ్రాడ్‌కాస్ట్‌లు, అధికారిక అప్‌డేట్‌లు, ఉషా కిరణం ఎడిటోరియల్ ప్రమాణాలు.
సవరణల కోసం సంప్రదించండి: help@ushakiranam.com